Friday, December 2, 2011

"పారిపోయిన ఖైదు--The Eloped Prison"


"పారిపోయిన ఖైదు--The Eloped Prison"



గురజాడ ఆంగ్ల రచనలపై ఓ సమీక్షా వ్యాసం


గురజాడ ఆంగ్ల రచనలపై మాట్లాడమని మొజాయిక్ సంస్ఠవారు అహ్వానించినప్పుడు ఇది నాకు పునర్జన్మగా భావించాను. ఈ రకంగా మళ్ళీ  గురజాడని చదివే అవకాశం కల్పించారు. గురజాడ గురించి ఒక్కమాట: "మనిషి బాధపడితే మంచి మాత్రెయ్యండి, మనసు బాధపడితే మంచి మాటివ్వండి మనిషి మనసు బాధపడితే వారికి గురజాడనివ్వండి"
శృంఖలా బధ్ధమైపోయిన వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యానికి తనదైనశైలిలో విముక్తి ప్రసాదించిన యుగకర్త గురజాడ గురించిన వ్యక్తిగతవిషయాల ప్రస్తావన ఇక అప్రస్తుతం-- కొన్ని మీకు తెల్సు కొన్ని వక్తలు ప్రస్తావించినవె....
గురజాడ రచనలగురించి చెప్పుకునే ముందు భారతీయాంగ్ల సాహిత్యం గురించి ప్రస్తావించుకోవల్సిఉంది.
Slide 2
భారతీయాంగ్ల సాహిత్యమంటే ఆంగ్లంలో  Indo-Anglian Literature. దానర్ధం మనం భారతీయభాషల్లో కాకుండా డైరెక్టుగా ఆంగ్లంలో రాసుకునె సాహిత్యం. ఈ రకమైన సాహిత్యానికి ఆద్యుడిగా, పూజ్యుడిగా గురజాడని చెప్పుకోవచ్చన్న దిశగా నా ఈ సమీక్ష ఉంటుందని మనవి. గురజాడ సమకాలికులైన టాగోర్ మరియు తోరుదత్ బెంగాల్ ప్రాంతానికి చెందిన రచయితలు. టాగోర్ బెంగాలీలోనూ, తోరుదత్ ఫ్రెంచ్ భాషలోనూ విరివిగా రాస్తూ వాటిని తామే తర్జుమా చేసే రచయితలుగా మనకి తెల్సు.
ఇవి గురజాడ ఆంగ్లరచనలు Slide 3
The very first English poem by him by name "The Cuckoo" was written when he was barely 20 in his matriculation stage of education. Unfortunately this work is unavailable.
కుక్కూ అన్న పేరుతో రాసుకున్న మొట్టమొదటి ఈ ఆంగ్ల కవిత ద్వారా మన గురజాడ భారతీయాంగ్ల కవిత్వమనే ఒరవడికి నాంది పలికినట్లుగా  చెప్పుకోవచ్చు.కన్యాశుల్కానికి పర్యాయపదమై, పూర్ణమ్మ సృష్టికర్తగా మాత్రమే మనకి సుపరిచితమైన గురజాడ తన కవనజీవనాన్ని ఓ ఆంగ్లకవితతో ప్రారంభించడం హర్షణీయం.  
దురదృష్టవశాత్తూ ఈ కవిత text అలభ్యం.కుక్కూ అంటె కోకిల. ఈ విధంగా ఈ కవికోకిల 1882 లో మెట్రిక్యులేషన్  విద్యాభ్యాస దశలోనే ఓ ఆంగ్లకవితతొ తన సాహిత్యాంరంగేట్రం చెయ్యటం జరిగింది. ఈ కవితలో ఏముందన్నది ఓ వైల్డ్ గెస్సే అయినా గురజాడ మరో ప్రముఖ రచన "దేశమును ప్రేమించుమన్నా..." లో చివరి ఖండికలో మరోసారి కోకిల ప్రస్తావనని ఇక్కడ ప్రస్తావించుకుందాం


Slide 4



ఇక ఆయన పద్యకావ్యం "సారంగధర"
గురజాడ ఆంగ్ల రచనల్లో ప్రముఖంగా చెప్పుకోవల్సినది ఈ సారంగధర.
it was published in 1883 in "Indian Leisure Hour" and  was an instant success. It was so successful that Gurajada was immediately contacted by one Mr Sambhu Mukherjee, chief editor of "REIS AND RAYYAT", a literary magazine published from Kolkatta and this Sarangadhara was republished. It is to be noted with great admiration that Gurajda was only 21 when this great work was publsihed. Slide 5



This poem exhibits his excellent command over English language and his poetical abilities. As a matter of fact by then Gurajada didnot give a thought to venture in Telugu literature. It was this Sambhu Mukhkerjee who encouraged him to pen his abilities in Telugu. From the minor poems like Emeralds and another one witout a title probably Gurajada was attempting to assess his poetic abilities and talent before he could make his way further in the world of letters. Surely and certainly he received what he augured for from the publication of Sarangadhara...........


సారంగధర ఓ గొప్ప రచన.  గురజాడ రచనా పటిమపై తనకున్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసె రచన. చారిత్రకభావన దేహం కాగా, భాషా సౌందర్యం, భావుకత్వపు పరికిణీలు, భారతీయత్వపు ఓణీలతో కూడిన ఓ అత్యధుత కావ్యనాయిక ఈ సారంగధర. భారతీయత్వాన్ని ఆంగ్లరచనల్లోకి చొప్పించే ప్రయత్నమే ఈ రచనని గొప్ప రచన కావటానికి కారణాల్లో ఒకటి. అప్పటికింకా  మరే ఇతర భారతీయ రచయితా ఇలా రాసిఉండనికారణంగా (టాగోర్, తోరుదత్ లాంటి రచయితలు సమకాలీనులే కాని గురజాడని ప్రభావితం చేసే వారు కాదు) మిగతా రచయితల ప్రభావం గురజాడపై ఉందనడానికి ఆస్కారమే లేదు. ఆ రకంగా గురజాడ మొట్టమొదటి భారతీయాంగ్ల కవిగా పేర్కొనవచ్చు.


Lets examine  some of the features of this great work.
In the very first canto "Godavary's bank", and later in the poem "Sampang blooms", "Malati twinning" these Indian sensibilites and widespread usage of Indian flowers  all through the poem mark a new era in Indian and English literature while givinig the work an everlasting aroma.
The audacity of language all over the poem make it special and leave his characteristinc marks As you can see in Slide 8 


"A brute is he....

Gurajada exhibited extraordinary knack in making the canto division and left a signboard at appropraite places to pause and brood over what we read. The treatment of the subject is Indianism again which revolves around values and sentiments. some of the lines like these prove the point.


This long poem was written in two parts and in second one Gurajada has prioritized narrating the  plot and characterisation was at its supreme best. Perhaps Sarangadhara was the first verse novel and therefore Gurajada has certainly paved way for the works like Vikram Seth's Goldengate. I don't doubt.The conversations are not long and fascinatingly readable but for the indianness. The Indian sensibilities throughout the poem render great warmth to the poem which is again a novel feature.Once we finish reading this great poem Sarangadhara undoubtedly we confer Gurajada with a title " The first Indo-Anglian poet" and we are certainly proud of it.


ఇక గురజాడ అనువాదాలు....


నీలగిరి పాటలు అన్న శీర్షికన సుమారు ఏడుపాటలు లభ్యం. ఇవి గురజాడ సాహితీబహుముఖప్రజ్నకు తార్కాణం. ఈ పాటలన్నీంటినీ తెలుగులోరాసుకుని వాటిని తనే స్వయంగా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకున్న వైనం ఇక్కడ Slide No.9 లో చూడగలరు.
నిజానికి ఈ అనువాదాలన్నింటినీ full fledged works in English గా సౌకర్యంగా చదువుకోవచ్చు. Slide No.10


సుందరతరమీ నీల నగము
సుందరతరమీ నీల నగము దీని|
యందము హృదయానందకరము దీని|
చందము హృదయానందకరము దీని|
నందనవనమిదె-- నాతిరో వింటివె|
బృందారకముని -- బృంద సేవితము||



ఇక నా ఈ ప్రసంగవ్యాసానికి "పారిపోయిన ఖైదు The Eloped Prison" అని రాయటానికి కారణం ఇదిగో శీర్షికలేని చిన్న ఆంగ్ల కవిత Slide No. 4


"ఆమె ఆలోచన్లని మనసు చెరశాలలో బంధించాను...కాని ఖైదీచాలా అసాధ్యుడు ఖైదులోంచి పారిపోతూ తనవెంట ఖైదునే తీస్కుపోయాడు".


An excellent expression of freedom, emphasizing the need for liberty in all aspects. May not be a serious attempt by Gurajada, as it lacked the title, and it could be just to float some of his poetic skills and this small composition could also be a ontribution to one of the literary jouranls like "Indian Leisure Hour" or " Telugu Harp" which Gurajada along with his brother Syamala Rao used to contribute.


ఈ కవిత రచనాకాలం పంతొమ్మిదో శతాబ్దం చివరిదశ అనిపాఠకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటె మన స్వాతంత్రోద్యమం మంచి ఊపుమీదున్న పరిస్థితి. అందరూ ఈ దిశగా రచనలు చేస్తున్నకాలంలో గురజాడ సరదాగా స్వేచ్చ స్వాతంత్ర్యాల గురించి ఇలా రాయడం సముచితమే.


There is another short verse by title "The Emeralds" which was written in litearay frame to suit the theme. This poem also could be a contribution to keep things rolling. 


Slide No.3


This Emeralds exhibits Gurajada's ability to treat a single theme in a brief and short poem paving way for his larger poems like Sarangadhara.


Next English poem to be considered is "కాంగ్రెస్ మహాసభ(మద్రాస్ 1908). This poem too is wihtout a title and is taken from an essay which bore the same title. It is a deliberate commentary on the state of affairs of Congress Party of pre-independent India and its members. The poem clearly reveals his associtation with politics and political parties which is a rararity among writers. 


గురజాడ వ్యక్తిత్వానికి మచ్చుతునక ఈ రచన. సాహిత్యానికి రాజకీయానికి ముడిపెట్టేసి ఈ ధృవాంతరాల రంగాల్లో ప్రయాణిస్తూ రాణించటం సాధారణ ఉదాహరణ కాదు. కాని రాజవంశానికి అంతఃపురానికి చాలా దగ్గరవాడయిన గురజాడ రాజకీయ సంస్థల్లో చురుగ్గా పాల్గొనడమే కాక తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే సత్సంప్రదాయానికి నాందీ రచన. నిజానికి ఈ కవితలో కొంత జర్నలిజాన్ని కూడా చూడొచ్చు పాఠకులు...


This poem shows Gurajada's serious attempt to voice out his contempt for the then statesmen and it also shows his love for political satires. It began with a punch which is typical of Gurajada. He has wisely used the poetic license to use two expressions in inverted commas to draw the attention of the readers when he said "empty" and "full". Certainly this work is quite  useful for journalists who constantly endeavour to expose the "sleeping leaders" in current times.


1897-- ఈ సంవత్సరం తెలుగు సాహిత్య చరిత్రలో ఓ ముఖ్యఘట్టం.
Slide No.13


శ్రీ శ్రీనివాసాచార్యులు గారి"హరిశ్చంద్ర" నాటకానికి ఆంగ్ల పీఠిక,
"కన్యాశుల్కం" నాటకానికి ఆంగ్ల పీఠిక.
ఇక్కడ గురజాడ గురించి చెప్పుకునే ముందు ఆంగ్ల సాహిత్యం గురించి చెప్పుకోవాల్సిఉంది.. పద్దెనిమిదవ శతాబ్దం చివరలో అక్కడ రొమాంటిసిజమ్ అనే సాహితీ ప్రక్రియ అమలులో ఉండేది...ఇందులో వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్, షెల్లి, కీట్స్ , బైరన్ వంటివారు ప్రముఖులు..ఇందులో వర్డ్స్ వర్త్ సాహిత్యభాష  ఎలా ఉండాలి అన్నదానిపై చాలా పట్టుదలలు ఉండేవి.  అప్పటివరకూ ఉన్న పండితులకే పరిమితమైన భాషని పూర్తిగా వ్యతిరేకిస్తూ  కవిత్వ భాషపై రాసినదే "wordsworth's theory of poetic diction" అదే మీరిక్కడ చూస్తున్నది...slide 14, 15 &16. వర్డ్స్ వర్త్ దీనిపై చాలానే రాశాడు. అప్పటివరకూ వాడుకలో ఉన్న పద్దెనిమిదో శతాబ్దపు బాషను పూర్తిగా ఖండిస్తూ పామరులకీ అర్ధమయ్యే రీతుల్లో సాహిత్యముండాలన్నది ఆతని వాదన. చెప్పింది చెయ్యడం వర్డ్స్ వర్త్  అలవాటు. అతని రచనలలో చాలా భాగం అలానే ఉండటం గమనార్హం. ఈ విషయాలన్నీ కూలంకషంగా చదువుకున్న గురజాడపై వాటి ప్రభావం ఉండటం, ఆ ప్రభావంతో తనూ తెలుగుభాషని విముక్తి చెయ్యటానికి కలాన్నె కత్తిగా చెయ్యాలనుకోవటం గొప్ప ఆలోచన. గురజాడ కావాలనుకుంటె ఆతని పూర్వీకుల్లానే రచనలు చెయ్యటం పెద్ద సమస్య కాదు. ఈ విషయానికి ఆతని కన్యాశుల్కం తొలి ప్రతే ఉదాహరణ.


కన్యాశుల్కం పీఠికలో గ్రాంధికభాషలోని అసౌకర్యాలూ, ఇబ్బందులూ వివరంగా చెప్పి వాడుక భాషను కావ్యభాషగా పెంపొందించడంవల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా వక్కాణీంచడం జరిగింది ఇది సాహిత్యభాషగా వాడుక భాష స్థాపనకు నవ్య ఆధునిక భాష వ్యాప్తికి అంకురార్పణ. ఇది గురజాడ కేవలం ప్రభువులకు అంకితం ఇవ్వడానికో, తన పాండిత్యప్రతిభను తెలుగుచరిత్రలో నిక్షిప్తం చెయ్యటానికో చేసిన రచనలు కావని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నమే...


To sumup-after examining most of the available works of Gurajada in English it appears that no two works are same, no two works have the same charactersitic features or traits. No common thread runs in all of his works. No common interest or common theme appears in his renderings. No two poems have the same set of expressions --like what we see in many poets--therefore no two works are same in style or frame. Gurajada did not carry any isms in his literary works except for pioneering "Freedom and Liberty".
Thus Gurajada is Man of Free thinking and Writer of Liberal views. 

వర్డ్స్ వర్త్ తనే రాసిన "ది కక్కూ" అనే ఆంగ్ల పద్యం ఆధారంగా తన మొదటికవితగా "ది కుక్కూ"  రాసి ఉండవచ్చేమో అని భావించటానికి కారణంగా వర్డ్స్ వర్త్ కవితని చూద్దాం చివరగా. Last Slide


గురజాడ తనే స్వయంగా తన రచనల గురించి వాటి ముఖ్యోద్దేశ్యం గురించి చెప్పినది, ఆయన మాటల్లోనే---
"నాది ప్రజల ఉద్యమం. దానిన్ని ఎవరిని సంతోషపెట్టడనికైనా వదులుకోలేను....నా ఆశయం ప్రజల ఆశయం. సంస్కారవంతుల సదభిప్రాయం నాకు అండగా ఉంది."గురజాడ 


Slide No.14


ఈ కవికోయిల ఆకులందు అణిగిమణిగి ఉంటూ తన పలుకులను అవసరార్ధం తెలుగు, ఆంగ్ల భాషల్లో పలుకుతూ దేశమందభిమానమును మొలకెత్తించి మందగించక ముందడుగేస్తూ తన స్వంత లాభం కొంత మానుకుని మరీ మనకి ఇన్ని మంచి రచనల్ని వొదిలేసి వెళ్ళిన గురజాడకి నమస్సుమాంజలులు.


۞۞۞